Apr 28, 2010

నేను కూడా బ్లాగ్ రాయడం ఎందుకు మొదలెట్టానంటే...

నేను కూడా బ్లాగ్గింగ్ చెయ్యడం...అంటే నాకే వింతగా ఉంది. ఇది కొంత వరకు "ఆంధ్రులు ఆరంభసూరులు" వంటి ఆవేశం కావొచ్చు. అసలు తెలుగు లో బ్లాగ్గింగ్ చెయ్యొచ్చు అని నాకు అసలు తెలీదు సుమీ. ఎప్పుడో ఈనాడు లో మన "మనిషి మనసులో మాట" సుజాత గారి గురించి రాసారు. అక్కడేమో  అబ్రకదబ్ర గారు కలిసారు. అవన్నీ చదివాక  ఏం మనం మాత్రం ఏం తక్కువ తిన్నాం, ఓ నాలుగు ఆకులు ఎక్కువే చదివాం, చందమామ లన్ని చదివాం, పనికి మాలిన సినిమా లు అన్ని చూసాం, మనం కూడా మొదలెట్టి కొంత కలాపోసన చేద్దాం, అన్న అమోఘమైన అవిడియా వచ్చింది.. ఆ విధంగా నా బ్లాగ్ రాతలు ప్రారంభమయ్యాయి.....ఇంక అనుభవించండి. అంతా  మీ కర్మ... నేను కూడా బ్లాగ్ రాయడం  ఎందుకు మొదలెట్టానంటే