Mar 3, 2011

Bryans Adams


                        Bryan adams in pune!!!!!!


ఆ యాడ్   చూడగానే .....జనాలందరూ ఒళ్ళూ పై మరిచిపోయి, బట్టలు చింపేసుకుని టిక్కెట్ల కోసం పరిగేడతారనుకున్నా . కానీ విచిత్రంగా ఎవరూ దాని గురించి డిస్కస్ చెయ్యలేదు. నాకసలు అర్థం కాలేదు. ఏంటి ఏమయ్యింది ....what happened ..what happened to my kingdom....అని సుత్తి వీరబద్ర రావులాగా అరిచా.ఎవరూ  పలకలేదు. పలకకపోతే నేను ఊరుకోనుగా. కనపడిన ప్రతీ వాడిని అడగడం మొదలెట్టా...
ఆ  విధంబెట్టిదనిన......


"మాస్టారూ, bryan adams వస్తున్నాడు తెలుసా .... "
"ఆ  తెలుసు ..."
"మరి తెలిస్తే ఇంకా అలా ఉన్నారేంటి ..పదండి టికెట్స్ తీసుకుందాం ..."
"మినిమం టికెట్ ప్రైస్ 2000 అంటే ఆలోచిస్తున్నా ...."


"రేయ్, bryan adams వస్తున్నాడు తెలుసా ..."
"అరె తెలీదు రా ..ఎప్పుడు వస్తున్నాడు ..."
"February పదకొండున, పద టికెట్స్ తీసుకుందాం...."
"సారీ రా ..ఆ రోజు నేను మా ఊరు వెళ్తున్నాను...."


"గురూ bryan adams పూణే వస్తున్నాడు  తెలుసా....."
"నిజమా...ఎప్పుడు....ఎప్పుడైతే ఏంటి, పద  టికెట్స్  తీసుకుందాం..."
"అబ్బ! నువ్వు రా  ఫ్రెండ్ అంటే.....పద  వెళ్దాం.....టికెట్ 2000 అంటే  ఒక్క యదవ కూడా వస్తానని అనడం లేదు." "రెండు వేలా!!! ....ఒకసారి మా  ఆవిడని అడిగి చెబుతారా...."


"ఒరేయ్ నెక్స్ట్ వీక్ పూణేలో bryan adams లైవ్ ఉంది, పద  టికెట్స్  తీసుకుందాం..."
"bryan adams ఎవరు? who is that?"
@#!@$@#%@$%^#^%^#$^ ( ఇక్కడ beeeeep అన్న సౌండ్ ఊహించుకొండి )


ఇక ఆఖరి ప్రయత్నంగా......
anybody going to bryan adams live???...అని పెట్టా facebook లో .
bryan adams లైవ్ కి వెళ్తున్నావా.....గుడ్ ..అని  కొట్టాడు ఒకడు కామెంట్. చెప్పు తీస్కుని కొట్టాలనిపించింది.

                 ఇలా కనపడిన ప్రతీ సన్నాసిని  అడిగి .... అడిగి .... విసిగి.... వేసారి....నీరసించి....ఏం చెయ్యాలో తెలియక....బిత్తర చూపులు చూస్తూ....ఒక  బలహీన క్షణంలో...ఒక్కడినే వెళ్ళడానికి నిర్ణయించుకుని....గుండె దిటవు చేసుకుని....రెండు  వేలు పెట్టి టికెట్  బుక్ చేసేసా. ఏంటి  ఎవరూ రానంటున్నారు....జనాలకి మ్యూజిక్ సెన్స్ పోయిందా....లేక నాకు పిచ్చెక్కిందా????

               వినాయకుడి   పెళ్ళికి వెయ్యి విగ్నాలన్నట్టు....బయలుదేరేరోజు అన్నీ అడ్డంకులే. ఉదయం  కడుపులో నొప్పి మొదలయ్యింది..ఇది తగ్గటం లేదు...ఎలా రా  భగవంతుడా?....అని  అనుకుంటుండగా...........ఊరి నుండి మావయ్య ఫోన్  ఆయనకు సంబంధించిన ఒక  వ్యక్తీ సాయంత్రం పూణే కు ఇంటర్వ్యూ కోసం వస్తున్నాడని. సదరు వ్యక్తికి హిందీ రాకపోవడం వల్ల,  అన్నీ  దగ్గరుండి చూసుకొమ్మని చెప్పాడు. నా గుండెలో రాయి పడింది. అయన మాట కాదనలేను. ఏం చెయ్యాలో తెలియక బుర్ర తిరిగిపోయింది.  ఒక పక్క కడుపులో నొప్పి టెన్షన్...ఇంకో పక్క సదరు వ్యక్తి టెన్షన్. ఈ రకంగా ఆఫీసు లో ఉండగా ...తను రైల్వే స్టేషన్లో  అప్పుడే దిగానని...వచ్చి పిక్ అప్ చేసుకోవాల్సిందని ఫోన్  చేసాడు సదరు  వ్యక్తి. ఇంక ఏం  ఆలోచించకుండా మా  ఫ్రెండ్  ఐన రెడ్డిగారికి ఫోన్  చేశా. వెళ్లి సదరు  వ్యక్తిని పిక్  అప్  చేసుకొని అయన  రూంలో  సాయంత్రం వరకు ఉంచవలసింది అనినీ ....నేను  సాయంత్రం వచ్చి  పిక్  అప్  చేసుకుంటాను అనినీ....రిక్వెస్ట్ చేశా. అసలే బాగా మంచివారు, మొహమాటస్తులు అయిన రెడ్డిగారు పాపం నా  మాట  కాదనలేక, సదరు  వ్యక్తిని  పిక్  అప్  చేస్కొని అయన  రూంకి  తీసుకెళ్ళారు. సాయంత్రం  గబగబా ఆఫీసు  నుండి   బైట పడి, రెడ్డిగారి రూం  నుండి  సదరు  వ్యక్తిని  తీసుకొచ్చి మా  రూంమేట్స్ కి   అప్పచెప్పి.....కంగారు కంగారుగా రెడీ అయ్యి  బైక్ ని  పరిగెట్టిన్చా.

              షో 6 కి  మొదలవుతుంది. నేనున్న ఏరియా నుంచి 15 kms దూరంలో  ఉంది  షో లొకేషన్. 4 కల్లా బైలుదేరా కాబట్టి ఎంత traffic ఉన్నా 5 కల్లా  చేరొచ్చు కదా అనుకున్నా. అనుకున్న దానికన్నా ఒక  పావుగంట ముందే అక్కడికి చేరుకున్నా. ఏంటి  పెద్ద పంచ్ ఏం  తగల్లేదు. మనం ఏం  చేసినా చిరిగి చేటంత అయ్యి.....చాపంతయ్యి ...పేటంత అవ్వాలే అని  అనుమానం వచ్చింది. శనిగాడు ఈసారి నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు అని  చాలా బాదపడ్డా. షో  AMANORA township లో  ఏర్పాటు చేసారు. Township లోపల బానే ఉంది  కాని, ఇంకా  construction పూర్తి కాకపోవడం వల్ల  రోడ్లన్నీ పరమ చెత్తగా ఉన్నాయ్. అసలే  నాది కొత్త  బైక్. దాన్ని కొత్త పెళ్ళాంలా చూసుకుంటున్నా.  ఆ  రోడ్డు లో  దాన్ని  డ్రైవ్ చెయ్యడానికి మనసొప్పలేదు. బైక్  గోతులలో పడినప్పుడు గుండెల్లో ఏదో తెలియని బాధ. అయినా ఏం  చేసినా bryan adams కోసమే కదా అని, రోడ్డు  వంక చూడకుండా డ్రైవ్  చేసుకుంటూ మెయిన్ టౌన్షిప్ ఎంట్రన్సు దగ్గరికి చేరుకున్నా. తీరా చూస్తె దాన్నుండి ఓన్లీ 10000, 6000 రూపాయల టికెట్  తీస్కున్న దొరలనే పంపిస్తారంట. నాలాంటి నెల బెంచి గాళ్ళకి వెనకనుండి ఇంకో ఎంట్రన్సు  ఏర్పాటు  చేసారంట. చివరికి పార్కింగ్ కూడా  వేరే వేరే  గానే. మెయిన్  ఎంట్రన్సు  పక్కనే 6000 టికెట్  వాళ్ళకి పార్కింగ్, 10000 టికెట్  అయితే లోపల  స్టేజి పక్కనే. అక్కడి నుండి  ఒక  అర కిలోమీటర్ దూరంలో  3500 గాళ్ళకి.అక్కడి  నుండి  ఇంకో  అర  కిలోమీటర్  దూరంలో  2000 టికెట్  గాళ్ళకి  పార్కింగ్. ఈ కిలోమీటర్  రోడ్డు  మరీ అధ్వాన్నం. బూతులు తిట్టుకుంటూ, ఎందుకొచ్చాను రా  బాబూ అనుకుంటూ ఆ  డొక్కు  రోడ్డులో వెళ్లి  పార్క్ చేసి ఊపిరి పీల్చుకున్నా.
                    స్టేజి  దగ్గరికి  వెళ్తుండగా...షో  చూడ్డానికి వచ్చిన సీతాకోక చిలుకల్లాంటి అమ్మాయిలు కనపడ్డారు. వాళ్ళని చూస్తూ  నేను  ఏ   పని మీద వచ్చానో మర్చిపోయాను.  పర్లేదు రెండు వేలు ఈ రకంగా  నైనా గిట్టుబాటు అయ్యాయి కదా  అని త్రుప్తి పడ్డాను. ఉన్నట్టుండి కొన్ని లావుగా మందంగా ఉన్న  సీతాకోకచిలుకలు కనపడగానే ఈ  లోకంలోకి వచ్చి  నేను  ఎందుకు వచ్చానో  గుర్తుకు వచ్చింది. టైం చూస్తె  5:20PM. గబగబా  నడుస్తూ స్టేజి  ఎంట్రన్సు దగ్గరికి  వెళ్లాను. స్టేజి  కట్టిన మైదానం చాలా పెద్దది. దాని చుట్టూ 20 అడుగుల ఎత్తు ఫెన్సు కట్టారు.మొదట 10000 ఎంట్రన్సు, తర్వాత 6000 తర్వాత 3500 అన్నిటికంటే చివరగా 2000 ఎంట్రన్సు. ఎక్కడికి వెళ్ళినా ఆ  తేడా మైంటైన్  చేసిన  వాళ్ళ  బుర్రలకి జోహార్లు!!! ఎగరేసుకుంటూ వెళ్లి  లైన్లో  నుంచున్నా. కొంచెం గమనించి చూస్తె, అందరి మెడలలోనూ id cards వేల్లాడుతున్నై. నేనొక్కడినే online లో  తీసుకున్న టికెట్  ప్రింట్ అవుట్తో నిలబడి ఉన్నా. అసలు విషయం అరా తీయగా....ఆ  ప్రింట్  అవుట్  చూపిస్తే మెయిన్  ఎంట్రన్సు  దగ్గర id card ఇస్తారనిన్నీ ...id card చూపిస్తే  తప్ప లోపలికి  పంపరనిన్నీ ...ఇప్పుడు id card కోసం  ఒక  కిలోమీటరున్నర నడిచి వేల్లాలనిన్నీ ....తెలిసింది. బైక్  కోసమైనా ఒక  కిలోమీటర్  నడవాలి. ఇప్పుడు  ఆ  పార్కింగ్ లోంచి బైక్  తీయడం కూడా  కష్టం. సో left right కొట్టుకుంటూ బైలుదేరా. అలా వెళ్ళగా.... వెళ్ళగా.... వెళ్ళగా........ వెళ్ళగా....మెయిన్  ఎంట్రన్సు  పక్కన ఎవరికీ కనపడకుండా ..ఒక  చిన్న బోర్డు పెట్టుకుని ఇస్తున్నారు id cards, online లో  టికెట్స్  తీసుకున్న  వాళ్లకి. మళ్ళీ అక్కడి  నుండి  షో  గ్రౌండ్స్ దగ్గరికి  పరిగెత్తా. టైం  6:45. ఇంకెందుకు  వెళ్ళడం, షో  సగం ఐపోయి ఉంటుంది, 2000 దండగ అనుకుంటూ  లోపలికి   వెళ్ళాక తెలిసింది, bryan adams ఇంకా  రాలేదని. హమ్మయ్య అని  ఊపిరి  పీల్చుకున్నా .
                      జనాలందరూ నీరసంగా కాల్ల్లీడ్చుంటూ తిరుగుతున్నారు . కాసేపు అమ్మాయిల్ని చూస్తూ  అటూ ఇటూ తిరగడం మొదలెట్టా. ఇంతలో పెద్దగా డ్రమ్స్ వాయించిన సౌండ్ . bryan adams వచ్చేసాడు అనుకుంటూ  జనం స్టేజి  దగ్గరికి  పరుగులు పెట్టారు. తీరా వెళ్లేసరికి ..ఎవరో highway67 అని  పూణే  లోకల్ రాక్ బ్యాండ్ అంట. టైం  ఉంది  కదా  జనాలని entertain చెయ్యడానికి  ఏర్పాటు  చేసినట్టున్నారు.  ఇంక  వాళ్ళు మొదలెట్టారు చూసుకోండి.... వాడు పాడుతున్నాడో ..గొణుగుతున్నాడో ...అర్ధం కాలేదు. వాడు  స్టేజి  మీద  చేసిన  తింగర చేష్టలు అన్నీ  ఇన్నీ కావు. ఒరేయ్  ఆపరా బాబు అని  జనాలు అరుపులు. అయినా  సరే, జనాలు   పొగుడుతున్నారు అనుకున్నాడేమో...ఇంకా  తింగర గా ..ఇంకా అసహ్యం గా  పాడటం మొదలెట్టాడు.
                    కాసేపటికి జానలందరూ బల్లుల్లా నేలకు కరుచుకుపోయారు. ఎవరూ  కదలడంలేదు  మెదలడంలేదు . జనాల్ని కంట్రోల్ చెయ్యడానికి వచ్చిన  పోలీసువాళ్ళు కుడా కనపడకుండా పోయారు. వీడు పాడుతుండగా ఎవరూ  గొడవ చెయ్యరని వీళ్ళకి ఎలా తెలుసిందో?? వాడికొచ్చిన పాటలన్నీ అయిపోయినట్టున్నై. పాడటం  ఆపేసి జానలందరికి అభివందనం చేసాడు, ఇక  సెలవు అన్నట్టు. భయంకరమైన చప్పట్లు expect చేసి  అలాగే నిలబడ్డాడు.
కాని  జనాల్లో ఒక్కడు కూడా  కిక్కురు మనలేదు. మిడతలు చేస్తున్న క్రీక్....క్రీక్ ...అన్న  సౌండ్  మాత్రం స్పష్టంగా  వినపడింది. మెల్లగా శబ్దం చెయ్యకుండా స్టేజి  దిగి వెళ్ళిపోయాడు. పాపం....నాకు  ఒకింత జాలేసింది. జనాలు  ఒద్దో...ఒద్దో  అంటున్నా, లెక్క చెయ్యకుండా  పాటలు పాడిన వాడి ధైర్యానికి మాత్రం అభినందిన్చాలనిపించింది. 

ఇంతలో ....."haallllooooo pooonaaaaa"

అదే గొంతు , bryan adams వచ్చేసాడు అంటూ జనాలందరూ స్టేజి  మీదకి దూకినంత పని చేసారు.
అంతే ఇంకేం సోది లేకుండా తిన్నగా మొదలెట్టేసాడు

Heaven
cuts like a knife
please forgive me
I am ready
lets make a night to remember
cloud number nine
summer of 69

ఇలా  ఒకదాని  తర్వాత  ఒకటి. ఆ సాంగ్స్ వింటుంటే చెవుల్లో అమృతం పోసినట్టు అనిపించింది. ఆ  సాంగ్స్  ఇది  వరకు విన్నా ....అలా డైరెక్ట్ గా వింటుంటే ..చాలా  అధ్బుతంగా  అనిపించింది. summer of 69 అయితే  పాటంతా జనాలే పాడేసారు. బ్రయాన్ ఆడమ్స్ జస్ట్ ఓపెనింగ్ chords వాయించాడు అంతే. స్టేజి  ముందు నాలుగు పెద్ద   స్క్రీన్స్ పెట్టారు. ఆ  నాలుగు  స్క్రీన్స్ లో  bryan ఆడమ్స్ ని ప్రాజెక్ట్ చేసారు. స్టేజి వెనుక   ఇంకో  పెద్ద  screen. దాని మీద  black and white లో  స్టేజి  మీద  జరుగుతున్నదంతా   నాలుగు  కామేరాస్ నుండి  broadcast చేసారు. చూడ్డానికి  రెండు  కళ్ళూ చాలలేదంటే నమ్మండి. పాటకి పాటకి  మధ్య సుమారుగా 15 సెకన్ల గ్యాప్ మాత్రమె తీసుకున్నాడు.  ఒక  సాంగ్  ఇచ్చిన మైకం నుండి  ఇంకా  తేరుకోకముందే  ఇంకో  సాంగ్. షో  అయ్యేసరికి ఒక  ఫుల్ బాటిల్ ఇచ్చినంత కిక్ వచ్చింది. దాదాపు రెండు  గంటలసేపు గొంతు  చించుకుని పాడినా, ఎక్కడా చిన్న  జీర గాని , ఇబ్బందిగా పాడడం గాని  లేదు .ఆ  స్టామినాకి  చేతులెత్తి దణ్ణం పెట్టాలి.

53 ఏళ్ల వయసులో  అంత ఉత్సాహంగా, అంత  energetic గా ,  రెండు  గంటల  పాటు జనాల్ని  అలరించిన ఆయనకు  జోహార్లు  చెప్పకుండా ఉండలేకపోతున్నాను.
ఈ ఆనందం మధ్య నా కడుపునొప్పి ఏమైందో నాకు ఇప్పటికీ గుర్తు రావడం లేదు!!!!!