May 5, 2010

నా బాల్యం







అవి ఇంకా కంపూటర్లు కొంపలోకి రాని రోజులు. మనిషికో సెల్ ఫోన్ లేని రోజులు. సినిమా చూస్తూ మనసులో విలన్ ని బూతులు తిట్టుకున్న రోజులు.......అంటే టూకీగా మన చిన్నప్పటి రోజులు అన్నమాట...ఎంత చిన్నప్పుడు అంటే నేను ఒకటి నుండి నాలుగో తరగతి చదివిన రోజులు....

అప్పుడు మనం మా ఊళ్ళోని విద్యావిహార అనే RSS స్కూల్ లో చవివేవాళ్ళం. అది ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం నాలుగు దాక ఉండేది. అందులో చాలా మంచి విషయాలు నేర్పే వాళ్ళు. మద్యానం భోజనం చేయబోయే ముందు సంస్కృతం లో ఓ శ్లోకం చద్విన్చేవారు. సహన భవతు సహను భువంతు...... మొదటి తరగతి నుండి సంస్కృతం  కూడా ఒక సబ్జెక్టు. తర్వాత ఇంటర్లో చదివిన  సంస్కృతం అంతా  అప్పుడే నేర్పించేసారు. లంచ్ అయ్యాక నోటీసు బోర్డు లో ఒక సూక్తి రాసేవారు.  అది అందరూ సూక్తి పుస్తకం  లో రాయాలి. అది రాసామా  లేదా అని మర్నాడు చెక్ చేసే వాళ్ళు. సూక్తి రాయటం అయ్యాక  SPL (school people's leader)  స్కూల్ మధ్యలో  నిలబడి మైక్ లో భగవద్గీత చదివేవాడు. వాడి వెనకాలే మనం కూడా అరవాలన్నమాట ...అదయ్యాక చిన్న పిల్లలనందరికి పడుకోబెట్టే వాళ్ళు... మనం పడుకుంటామా?....క్లాసు లో ఎవడి పెన్సిల్ పెద్దది అనే competetions అన్ని అప్పుడే జరిగేవి. పెన్సిల్ అయ్యాక కణికెలు. ఇలా అన్నమాట.. దాని కోసం  రోజుకో పెన్సిల్ కొనమని ఇంట్లో పీడించుకుని తినడం. రోజుకో  పెన్సిల్ పడెయ్యడం, లేకపోతే ఎవడికో  దానం చెయ్యడం. ఇది విని మనం ఏదో పెద్ద దాన కర్ణ అనుకునేరు....కొంపదీసి.....వాడికి ఆ పెన్సిల్ ఇస్తే వాడు ఇంకొన్ని రోజులు ఆ పెన్సిల్ పట్టుకొస్తాడు... మనం  మర్నాడు కొత్త పెన్సిల్ తెచ్చేసి  వాడికి ఆ నాలుగు రోజుల నేనే  గొప్ప అని అనిపించుకోవచ్చు...అదన్నమాట ...ఇంకెప్పుడూ అలా అపార్థం చేసుకొకండే..... మూడింటికి లేచి ఆడుకోవడం నాలుగింటికి దుకాణం సర్దేసి కొంపకి చేరుకోవడంఅలా ఉండేది జీవితం.

3 comments:

ఊకదంపుడు said...

ఆనంద్ గారూ
మీ బ్లాగ్ ఇవేళే చూడటం. చక్కగా రాస్తున్నారు, ఆరంభశూరత్వం అన్నమాట నిజం చేయకుండా కొనసాగించండి.
అభినందనలతో
ఊకదంపుడు

స్థితప్రజ్ఞుడు said...

@ఊకదంపుడు

ఆహా మీరే! నా బ్లాగ్ చదివి కామెంట్ కూడా రాసారా....!!!

నా జన్మ ధన్యమయింది..

మీకో నిజం చెప్పాలి....నాకు నిజంగా బ్లాగ్ రాయాలి అని అప్పుడప్పుడూ అనిపించినా... ఎప్పుడూ అంత ఆవేశం రాలేదు...

అలా బ్లాగులు చదువుతుండగా...మీ బ్లాగ్ చూడడం జరిగింది...

మీ బ్లాగ్ టైటిల్ చూసి ఓ పావుగంట నవ్వుకునాన్నంటే నమ్మండి...

వెంటనే ఈ బ్లాగ్ స్టార్ట్ చేశా...

తప్పకుండా రాస్తానండీ....మీలాంటి వల్ల ప్రోత్సాహం ఉంటే దంచేయనూ..

అన్నట్టు నా కథ చదివి నా పేరు ఆనంద్ అనుకుంటున్నారేమో......నా పేరు రాఘవ..

మొత్తం కథ అంతా చదివారా...

ఊకదంపుడు said...

ధన్యోస్మి, కధలో లీనమవ్వటమ్ వల్ల పేరు తప్పు దొర్లి ఉంటుంది, రాఘవ గారూ. ఈ కధ మొత్తం అప్పుడే చదివాను. ఇంకా కొన్ని చదవవలసిన టపాలు ఉన్నాయి. ఇవాళ చదువుతున్నాను.

Post a Comment