May 26, 2010

నా సాహస యాత్ర

 
మనం రోజూ  రిక్షా మీద స్కూల్ కి వెళ్ళేవాళ్ళం. ఓ సుభ దినాన ...మా రిక్షా వాడు  జయిగా తాగేసి ఎక్కడో తొంగున్నాడు. అయిదు అయినా  రాలేదు...మిగతా పిల్లలందరూ వెళ్ళిపోయారు. మా రిక్షా లోని పిల్లల్ల్ని వాళ్ళ వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి తీసుకెళ్ళిపోయారు..నాన్న వేరే ఊరు వెళ్లారు..ఈలోపులో అమ్మ ఎవర్నో నన్ను తీసుకు రమ్మని పురమాఇంచేసరికి ఆలస్యం అయి ఉంటుంది....నేను ఒక్కడినే ఉండి పోయాను. ఇంగ్లాండ్ కి బైలుదేరిన పార్వతీశం లాగా గుండె దిటవు చేసుకుని...మనం ఏం చేసినా లోక కళ్యాణం కోసమే కదా ఆనుకుని....నడుస్తూ బైలు దేరాను. ఇంటికి  వెళ్లేసరికి మా అమ్మ అరుగు మీద కూర్చుని భోరున ఏడుస్తోంది...ఒకే ఒక్క   కొడుకుని మరి ఆ మాత్రం భాద ఉంటుంది కదా. నన్ను చూడగానే అమాంతం  వాటేసుకు ఇంత సేపు ఏమయ్యావు రా...ఆ దరిద్రపు గొట్టు   రిక్షావాడు నిన్ను కిడ్నాప్ చేసాడేమో అని తెగ కంగారు పడుతున్నాం అని వాడిని వాడి అమ్మని అమ్మ్మమ్మని అందర్నీ తిట్టడం  మొదలెట్టింది. కొంచెం శాన్తించాక   మెల్లగా అడిగింది ...ఎవరు తీసుకొచ్చారు కన్నా అని. ఎవరూ తీసుకురాలేదు..నేనే  నడిచి వచ్చేశా అని olympic medal నేనే గెలిచా అన్నట్టు చెప్పా. అంతే మళ్లీ ఏడుపు మొదలు..నిన్ను ఎవరాన్న దార్లో ఎత్తుకు పోయుంటే నేనేమయ్యేదాన్నిరో....మళ్లీ ఒక గంట పట్టింది ...తర్వాత నన్ను మెచ్చుకోవడం మొదలెట్టింది...నీకెంత ధైర్యం రా కన్నా....ఇలా...ఇంతలో ఎవరో దారిన పోయే దానమ్మ వెళ్తూ మీ పిల్లాడు  రాలేదన్నారు వచ్చేసాడా అని కుశల ప్రశ్నలు మొదలెట్టింది. మా అమ్మ అంది...చూసారా మా వాడు నడిచి వచ్చేసాడు ....మీ వాడు పగలు వీధి లో  తిరగాడానికే భయం ఆంటాడు... మా వాడు స్కూల్ నించి చీకటి పడిన తర్వాత  అంత దూరం ఒక్కడే నడిచి  వచ్చాడు...అని  గర్వంగా  చెప్పటం మొదలెట్టింది.....

ఇంతకి స్కూల్ నుండి మా ఇంటికి దూరం ఎంతని ఆడగరే?

అర  కిలో మీటర్

2 comments:

Ravitej said...

Burra paadu ra... eppudu nijam matladukundama..

Stitaprajna: Matnee cinemaki velli..intiki vacchesariki sayantram 7 ayyindii..

స్థితప్రజ్ఞుడు said...

ఏడిశావ్....అప్పుడు నేను రెండో తరగతో మూడో తరగతో చదువుతున్నా....
నువ్వు ఆ వయసు లో అలాంటి పనులు కూడా చేసావా....

Post a Comment