Aug 20, 2012

జులాయి

గమనిక:
ఈ కథ లొని పాత్రలు కేవలం కల్పితం. బ్రతికున్న లేక మరణించిన మనుషులతో ఈ కథ లోని  పాత్రలకు సంబంధం ఉన్నట్టు అనిపించడం కేవలం యాదృచ్చికం 

               ఒక చల్లని సాయంత్రం. ఆకాశం అంతా మబ్బులు కమ్మి ఉన్నాయి. నీరసంగా ఆఫీసు నుండి వచ్చిన నన్ను చూసి మా అవిడ ఫక్కున నవ్వింది. ఆ నవ్వు చూసి కొపం వచ్చినా, మనోహరమైన ఆ నవ్వు చూసి కొంచెం మనస్సు ప్రశాంతంగా అనిపించింది. నా పరిస్థితి అర్ధం చేసుకొని చప్పున కాఫీ తెచ్చి ఇచ్చి, లాప్ టాప్ లో నాకిష్టమైన " ఓ మధు...ఓ మధు....." పాట పెట్టింది. పాట అయ్యేసరికి మామూలు మనిషినయ్యాను.  

"ఏమైనా డార్లింగ్, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కేక. అసలు ఈ సాంగ్ వెండి తెర మీద చూడాలి. మూవీ రాగానే గుర్తు చెయ్యి, టికెట్స్ బుక్ చేస్తా" అన్నాను అవేశంగా. 

"రేపు రిలీస్ అవుతుందని నిన్న చెప్పాను మీకు" తాపీగా చెప్పింది శ్రీమతి. "ఈరొజే రిలీస్ అయిపొయిందా!!! మళ్ళీ ఇంకొసారి ఈరోజు ఉదయం గుర్తు చెస్తే నీ సొమ్ము ఎమన్నా పొతుందా?" టికెట్స్ దొరకవేమో అని కొపంతో కూడిన ఆందొళన.

"ఈరోజు కాదు....రేపు రిలీస్" నింపాదిగా చెప్పింది.

"మరి ఇందాక ఈరోజు అని చెప్పావ్" అన్నాను కరవడానికి సిద్ధమవుతూ.

"రేపు అంటే ఈరోజుకి రేపు, నిన్నకు  ఎల్లుండి" అదే నిదానం.

"నా వల్ల కాదే , నా వల్ల కాదు. ఈమధ్య నిన్నేమన్నా అంటే క్షమించవే. దయ చేసి సరిగ్గా చెప్పు. జులాయి మూవీ ఎప్పుడు విడుదల అవుతుంది" ప్రాధేయపడుతూ అడిగా.

"రేపు"   

"హమ్మయ్య, సరే ఐతే. ఇప్పుడే వెళ్ళి టికెట్స్ బుక్ చేస్తా."



"ఒక్క నిమిషం ఆగండి, రేపు రిలీస్ అయ్యాక ఎలా ఉందో కనుక్కొని అప్పుడు వెళ్దాం." ఈమధ్య నాకు సలహాలు కొంచెం ఎక్కువగా ఇస్తోంది, ఈ విషయం గురించి కొంచెం ఆలోచించాలి.

"ఏం మాట్లాడుతున్నవ్? త్రివిక్రం డైరక్షన్, దేవి సంగీతం, అల్లు అర్జున్ డాన్స్. ఇంకేం కావాలి నీకు" సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడి లాగా అమాయకంగా అడిగా.

"కథ" 
ఎప్పుడూ ఇలాగే ఒకటి రెండు పదాల్తో సమాధానాలు చెబుతుంది,  ఒళ్ళు మండేలా.   
"ఏడిసావ్ లే. అన్ని ఉన్నాక కథ పెద్దగా అవసరం లేదు. ఎప్పుడు తెలుసుకుంటావో?" పాపం నిజంగానే కొంచెం జాలి వేసింది మా ఆవిడ మీద.

"సరే మీ ఇష్టం" ఈ డయలాగ్ వేసిందంటే ఇక తర్వాత మనం ఏం చెప్పినా పట్టించుకోదు.

తిన్నగా వెళ్ళి రెండు టికెట్స్ బుక్ చేసేసా రేపటి సాయంత్రం షో కి.

(మర్నాడు................)

నేను చెయ్యాల్సిన పనులన్నీ నా కింద పని చేసే వాళ్ళకి అంటగట్టేసి సాయంత్రం త్వరగా ఆఫీస్ నుండి బయటపడ్డాను. నేను వచ్చేసరికి రెడీగా ఉంది శ్రీమతి. నేను కూడా ఐదు నిమిషాల్లో రెడీ అయ్యి పావుగంటలో థియేటర్ కి   చేరుకున్నాం. 

"సినిమా అంటే ఎలా ఉండాలో తెలుసుకో. హీరో ఇంట్రొడక్షన్ సీన్ చూడు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వకపోతే అడుగు" చిద్విలాసంగా నవ్వా.

ఇంట్రొడక్షన్ సీన్ వచ్చింది. ఆసలు హీరొనా కాదా అన్న అనుమానం నాకే కలిగింది. పరమ వరష్ట్ గా ఉంది.

"ఇదేనా ఇంట్రొడక్షన్ సీన్" మా ఆవిడ వెటకారపు ప్రశ్న. కడుపు మండింది.

"మా హీరొ సింప్లిసిటీ అంటే ప్రాణం ఇస్తాడు. నీకు అర్ఠం కాదులే. తర్వాత ఓ మధు...ఓ మధు..... పాట వస్తుంది. ఇరగదీస్తుంది చూడు " ఏదో కవర్ చేసా.

ఓ మధు...ఓ మధు..... పాట వచ్చింది.

పాట అయిపొయాక కళ్ళెగరేస్తూ అడిగా " చూసావా అదిరింది పాట"

"పాట బావుంది కాని, స్టెప్స్ బాలేవు. ఐనా రొమాంటిక్ సాంగ్ లో ఆ వెనకాల పిచ్చి పిచ్చిగా జనం ఎంటి?"
నా దగ్గర సమాధానం లేదు. నేను ఇంక తర్వాత ఏ పాట గురించి అడగలేదు. అన్ని పాటలూ అలానే ఉన్నాయి మరి.      

"ఏదేమైనా ఫైట్స్ చాలా  బావున్నాయి" కనీసం ఒక్కటైనా బావుందని మా ఆవిడ చేత అనిపించాలని నా పిచ్చి ప్రయత్నం.

"ఏది కారుతో పాటు సమాంతరంగా పరుగెట్టి డ్రైవర్ని బయటకు లాగేసాడు అదా...."

"కాదు కాదు..."

"వేగంగా వెళ్తున్న  కారు ముందు దొర్లి కత్తితొ కారు ముందు రెండు చక్రాలకి పంక్చర్ చేస్తాడు అదా..."  
     
"కాదు కాదు..."

"హైవే మీద నుండి కారుతొ పక్కనున్న బిల్డింగ్ మీదకు ఎక్కి, దాని మీద నుండి అటు పక్కనున్న హైవే మీదకు కారుతొ సహా దూకుతాడు అదా...."

"కాదు కాదు..."

"హెలికాఫ్టర్ నుండి దూకి........."

"చాలు చాలు ఇక ఆపు" దిక్కు తోచని స్థితిలో అరిచా...
 
థియేటర్ నుండి బయటకు వస్తూ ఇంక ఆపుకోలేక అదిగా..."ఈ సినిమా మీద నీ అభిప్రాయం ఏమిటి?"

"స్టోరీ బాలేదు. హీరోకి తప్ప ఇంక ఎవరికీ బుర్రలు పనిచెయ్యవు. పొలీసులకైతే అసలు బుర్రలే లేవు. డాన్స్ బాలేదు.
ఇలియానా నటన అంత బాలేదు. అసలు ఆ కారక్టర్ కి అంత ప్రాముఖ్యత లేదు. కామెడీ పర్లేదు. సినిమా ఒకసారి చూడడం కూడా ఎక్కువే. పనీ పాటా ఏమీ లేకపొతే మాత్రం ఒకసారి చూడొచ్చు." గుక్క తిప్పుకోకుండా  చెప్పింది. 

"ఇప్పుడొస్తున్న చాలా సినిమాలకన్నా నయం తెల్సా...." అవమానం భరించలేక అన్నాను.

"అంతే మనం. ఒక చెత్తతో ఇంకొక చెత్తని పోల్చుకుని సంతృప్తి చెందడమే" ఉన్నది ఉన్నట్టు చెప్పింది.

ఇంక నేను కిక్కురుమంటే ఒట్టు.   
PS: ఐనా ఈ సినిమా అంత బాగా లేకపోవడానికి కారణం ఒక మాంచి మాస్ మసాలా సాంగ్ లేకపోవడమే అని సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడిగా నా అభిప్రాయం. 

3 comments:

Krishna said...

నాకు నిన్ను మొర్నింగ్ షౌ లొ నిన్ను మీ ఆవిడ తొ చూసినట్టు గుర్తు రా. ఈవెనింగ్ షౌ కి మళ్ళ వెళ్ళరా?
ఎంతైనా నీ ఒపిక్కు మెచ్ఛుకొవాల్సిందే.

స్థితప్రజ్ఞుడు said...

ఈ కథ లొని పాత్రలు కేవలం కల్పితం. బ్రతికున్న లేక మరణించిన మనుషులతో ఈ కథ లోని పాత్రలకు సంబంధం ఉన్నట్టు అనిపించడం కేవలం యాదృచ్చికం

KP moksha said...

Idlebrain లొ reviews రాయడం మొదలుపెట్టెయి. డబ్బులు వస్త్తాయి, Reviews కాస్త కూడ realistical గా ఉంటాయి !!

Post a Comment