Jul 20, 2010

అహం స్థితప్రజ్ఞః .....1

స్థితప్రజ్ఞత.....అంటే ఏంటి?
అని చాలా మంది నన్ను అడగడం వల్ల
ఈ టపా రాస్తున్నాను...మొదట్లో...నాక్కూడా స్థితప్రజ్ఞత అంటే ఏంటో తెలియదు ( అంటే మొదట్లో ఎవరికీ ఏమీ తెలియదనుకోండి...).
చిన్నప్పుడు ఒక రోజు నాన్నగారు భగవద్గీత కాసెట్ పెట్టారు టేప్ రికార్డర్ లో.....పార్థా...అని మొదలెట్టారు ఘంటసాల గారు...అర్థం కాకపోయినా ఏదో బానే ఉంది అనిపించింది...అందులో సంజయ పర్వం లో ఇలా ఉంది..

"దుఃఖము కలిగినపుడు దిగులు చెందనివాడు,
సుఖములు కలిగినపుడు స్పృహ లేనివాడు,
రాగము, ద్వేషము, భయము లేనివాడు.....
అట్టివాడిని..స్థితప్రజ్ఞుడని చెప్పవచ్చును..."

అది విన్నాక మెరుపులు మెరిసినట్టు....ఆకాశం లోంచి దేవతలు పుష్పవర్షం కురిపించినట్టు అనిపించింది...(నిజ్జంగా నిజం...కావాలంటే మీ మీద ఒట్టు...)
అరె... సరిగ్గా ఈ లక్షణాలన్నీ మనలో ఉన్నాయే...అంటే మనం స్థితప్రజ్ఞులమన్నమాట....అని గ్రహించిన క్షణం అది. తర్వాత ఇంకెవరన్నా అలాంటి వాళ్ళు ఉన్నారేమోనని వెదికా....ఊహూ...ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించలేదంటే నమ్మండి. ఎప్పుడో భరతంలో భీష్ముడు..తర్వాత నేను.

                ఆ తర్వాత నేను స్థితప్రజ్ఞుడిని అని ఋజువు చేసే చాలా సంఘటనలు జరిగాయి. కావాలంటే మచ్చుకి కొన్ని చదవండి....చదివాక మీరే ఒప్పుకుంటారు మీరు నేను స్థితప్రజ్ఞుడిని అని...

                            అప్పుడు నేను ఏడో క్లాసు చదువుతున్నా..మనమే క్లాసు ఫస్ట్. పబ్లిక్ పరీక్షలకి వీరబట్టీ వేసి తయారయిపోయాను. స్కూల్ నుండి పరీక్ష జరిగే చోటుకి బస్సు వేసారు మా స్కూల్ వాళ్ళు. పొలోమని ఎక్కేసాం పిల్లలమంతా. ఇంతలో, ఎప్పుడూ నా పక్కన కూర్చోని నాగబాబు, నా పక్కన కూర్చున్నాడు. వాడిది నాది పక్క పక్క హాల్ టికెట్ నంబర్లు. " ఒరేయ్! రెండు రోజులనుండి జ్వరం, వాంతులు విరోచనాలు, ఏమి చదవలేదు రా. ఫెయిల్ అవుతానేమో అని భయంగా ఉంది రా. మనిద్దరిదీ పక్క పక్క నంబర్లే గా, కొంచెం చూపించరా, ప్లీజ్" అన్నాడు. పోన్లే అని ఓకే అన్నా. సరిగ్గా వాడిది నా వెనకాల సీటే. నేను కొంచెం పక్కకి పెట్టి కనిపించీ కనిపించనట్టు చూపించా అన్ని పరీక్షలూను. ఎలా చూసి రాసాడో గాని...రిజల్ట్స్ వచ్చేసరికి..వాడు ఫస్ట్ నేను సెకండ్. అదేంట్రా...వాడేమీ నీలా తెలివైన స్టూడెంట్ కాదు కదా.. వాడికి ఎలా వచ్చింది ఫస్ట్ అని ఎవరైనా అడిగితే....అంతా ఈశ్వరేచ్చ...మన చేతుల్లో ఏముంది నాయనా అన్నానే తప్ప మామూలు వాళ్ళలా ఏడవలేదు...
ఇప్పుడు చెప్పండి నేను స్థితప్రజ్ఞుడినా కాదా..????

 ~~సశేషం~~

4 comments:

స్థితప్రజ్ఞుడు said...

అయ్యో..!!

సౌమ్య గారు పొరపాటున మీరు రాసిన వ్యాఖ్యలు డిలీట్ అయిపోయాయి.

అందుకని వాటిని నేనే మళ్లీ రాస్తున్నాను....



సౌమ్య

@ స్థితప్రజ్ఞుడు
నాకు చాలా చాలా అనందంగా ఉంది. ఎంతో ఓపికగా నా టపాలనీ చదివి కామెంటు కూడా పెట్టారు. ఇప్పటివరకు ఇలా ఏకబిగిన నా టపాలు చదివి (చదివారేమో) కామెంటు పెట్టినవాళ్ళు లేరు. Thank you, Thank you so much. ఇలాగే మీ ప్రోత్సాహం నాకెప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నాను :).



సౌమ్య
@ స్థితప్రజ్ఞుడు

ఓ సూపరు...మీరు అతి స్థితప్రజ్ఞుడు....సందేహం లేదు :D

స్థితప్రజ్ఞుడు said...

@సౌమ్య

అరె తప్పకుండా..... మీరు అంతగా అడగాలా.......

ఏంటి నేను అతి స్థితప్రజ్ఞుడినా!!! ఎక్కడో వెటకారం ధ్వనించినట్టనిపిస్తోంది. మీరు అలా అంటే నాకు కోపం వస్తుంది...ఆ కోపం లో నేను ఏం చేస్తానో నాకే తెలియదు. మర్యాదగా...నేను స్థితప్రజ్ఞుడి నని ఒప్పుకుంటారా లేదా...


అన్నట్టు నేనో కథ రాసా...చదివి మీ అభిప్రాయం చెబితే....సంతోషిస్తా....

ఇదిగో లంకె..

http://sthithapragnudu.blogspot.com/2010/06/blog-post_15.html

మొత్తం 7 భాగాలు...చిన్నవే లెండి...

ఆ.సౌమ్య said...

అబ్బే వెటకారమేమీలేదు...అంతే అదీ ఆ ఆ అవన్నీ అలా డైరెక్టుగా చెప్పకూడదు :P

బాబోయ్ మీరు కథలా రాస్తారా అంటే అన్న నుండి ఇన్స్పిరేషనా? :(

హహహ ఊరికే అన్నానులెండి...చదువుతా, చదివి నా అభిప్రాయం తప్పక చెబుతాను :)

స్థితప్రజ్ఞుడు said...

అన్నతో పోల్చారా నన్ను....

అన్న కాలి గోటి చివర ఉన్న వెంట్రుక ముక్క మీద ఉన్న ధూళి కణం లాంటి వాడిని....ఎంత మాటన్నారు నన్ను..
కథ మరీ అన్న అంత రేంజ్ లో ఉండదు లెండి....మధురవాణి గారు బానే ఉందని ఒటేసారు, కాబట్టి మీరు భయపడకుండా చదవొచ్చు......

Post a Comment